YSRCp and leader of the opposition Y.S. Jagan Mohan Reddy lashed out at chief minister N. Chandrababu Naidu over repeated cheating of backward classes and Kapus in the name of reservations.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం కొనసాగుతోంది. 27వ రోజు చేరుకున్న ఆయన పాదయాత్ర అనంతపురంలో రెండో రోజు ప్రజలతో మమేకం అవుతూ ముందుకు వెళ్తున్నారు.
గుత్తి శివారులో ఓ అభిమాని వైయస్ జగన్ వద్దకు వచ్చి టీ, బన్ ఇచ్చారు. దానిని జగన్ ఆప్యాయంగా తీసుకున్నారు. టీలో ఆ బ్రెడ్డును ముంచుకొని తిన్నారు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు రైతులతో మాట్లాడారు. గుత్తి పెద్ద చెరువును అభివృద్ధి చేసి స్థిరీకరించాలని కోరగా, అధికారంలోకి రాగానే సమస్యలను తీరుస్తానని జగన్ చెప్పారు. జగన్ తన పాదయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మండిపడుతున్నారు. ఎన్నికల హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఈసారి గతం కంటే అదిరిపోయేలా ఇంటికి కిలో బంగారం, కారు, భారీ హామీల మేనిఫెస్టోతో ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.